కేజిఎఫ్ మూవీ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వెంకటేష్ మహా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకటేష్ మహా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ దర్శకుడు కేర్ ఆఫ్ కంచరపాలెం అనే మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించాడు . దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించిన మొట్ట మొదటి మూవీ తోనే ఈ దర్శకుడు అదిరిపోయే విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇటు ప్రేక్షకుల నుండి ... అటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను ఈ మూవీ ద్వారా అందుకున్నాడు.

ఇలా కేరాఫ్ కంచరపాలెం మూవీ తో వెంకటేష్ మహా దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఉమా పరమేశ్వర ఉగ్రరూపస్య అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా నెట్ ఫిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇలా దర్శకుడిగా తన కంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కే జి ఎఫ్ మూవీ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దానితో తాజాగా వెంకటేష్ మహా స్పందించాడు. ఒక బాధ్యతాయుతమైన దర్శకుడుగా నేను వాడిన భాష సరిగా లేదు. ఆ విషయంలో క్షమాపణ చెబుతున్నా ... కానీ నా అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోను ... దానికి కట్టుబడి ఉన్నా అని వెంకటేష్ మహా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: