డబ్బుల కోసం ఆ పని చేయడానికి కూడా ఓకె అంటున్న తమన్నా..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే అందం ఒకటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో ఎవరికీ తెలియదు. కొన్ని సమయాల్లో ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ మంచి అవకాశాలు రావడం మనం చూసాం. కానీ మరికొన్ని సమయాల్లో మాత్రం వరుసగా హిట్లు అందుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడం ఎవరు పట్టించుకోకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ హీరోయిన్లకు మాత్రం వారి వయస్సు పెరిగే కొద్దీ ఛాన్సులు కూడా అలాగే తగ్గిపోతూ ఉంటాయి. అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నకి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తెలుస్తుంది. ప్రస్తుతం తమన్న కి అవకాశాలు లేని సంగతి మనందరికీ తెలిసిందే. 

యూత్లో తమన్నకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతోపాటు తమిళంలో కూడా చాలామంది స్టార్ హీరోల్లో సరసన కలిసి నటించింది తమన్నా. కానీ ప్రస్తుతం గత కొంతకాలంగా ఈమె చేస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ప్లాపులు అవుతున్నాయి. దాంతో ఈమె కెరియర్ డైలీ పోయింది అని అంటున్నారు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్లో ఏమన్నా చాన్సులు వస్తాయా అని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది తమన్నా. ఇకపోతే ప్రస్తుతం తమన్నా లాస్ట్ స్టోరీ సీక్వెల్ లో నటిస్తోంది. ఇది తప్ప తనకి మరొక సినిమా లేదు. దీంతో ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే అవకాశాలు రాకపోవడంతో తమన్న ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తోంది.

గతంలో తమన్న షాప్ ఓపెనింగ్లు కల్చరల్ ఈవెంట్లకు గెస్టుగా వెళ్ళేది. కానీ ఇప్పుడు మాత్రం ఏ షాప్ ఓపెనింగ్ కి కూడా గత కొంతకాలంగా ఆమె వెళ్లడం లేదు. కానీ ఎప్పుడు మాత్రం ఎలాంటి చిన్న షాప్ ఓపెనింగ్ అయినా సరే వస్తాను అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట తమన్న .అంతేకాకుండా డైరెక్టర్లకు కూడా స్వయంగా తానే ఫోన్ చేసి ఇలాంటి వెబ్ సిరీస్ లో అయినా అవకాశాలు ఉంటే చెప్పండి వస్తాను అంటూ అడుగుతోందట తమన్న. ఇక ఈ విషయం తెలిసిన తమన్న అభిమానులు ఏంటి తమన్నా ఇలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆఫర్లు లేక ఇంతలా దిగజారిపోయిందా అంటూ తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: