రవితేజను దారుణంగా మోసం చేసిన బండ్ల గణేష్..!?

Anilkumar
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రవితేజ బండ్ల గణేష్ చేతిలో మోసపోయాడు అన్న ఒక వార్త ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ విషయం ఏంటంటే.. మొదటిగా కమెడియన్ నుండి భారీ ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఆయన పలు ఇంటర్వ్యూ లతో సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాడు.అంతేకాదు ఆ మధ్య పాలిటిక్స్ కూడా ట్రై చేశాడు. బండ్ల గణేష్ నిత్యం ఏవో ఒక పోస్టులు షేర్ చేస్తూ ఇంటర్వ్యూలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. 

ఈయన వీటితో ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్  గా మారుతూనే ఉంటాడు బండ్ల గణేష్ .అయితే ఈ నేపథ్యంలోనే కావాలని హీరో రవితేజని మోసం చేశాను అంటూ కొన్ని కామెంట్లను చేసాడు బండ్ల గణేష్. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన కామెంట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఒక ల్యాండ్ విషయంలో మాస్ మహారాజా రవితేజని మోసం చేశాడని స్వయంగా బండ్ల గణేష్ ఒప్పుకున్నాడు.ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. రవితేజ కి నేను పొలాన్ని అమ్మడం జరిగింది.. ఇక రవితేజ ఆ పొలాన్ని ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు ఆ పొలం కింద నాకు ఇంకో మూడు ఎకరాల పొలం కూడా ఉంది.. ఆ సమయంలో అంతా కలిపి ఒక బిట్టు లాగా అమ్మితేనే ఆ పొలాన్ని కొంటామని చెప్పారు..

దాంతో మంచి లాభం వస్తుంది అని అనుకున్నాను ఆ సమయంలో రవితేజ దగ్గరికి వెళ్లి నిజం చెప్పకుండా ఒక అబద్ధాన్ని చెప్పాను. ఆ ప్రాంతంలో ప్రభుత్వం సేకరణ చేస్తుందని అమ్మడం బెటర్ అని చెప్పాను..  చెప్పిన వెంటనే ఆ భూమిని అమ్మేశాను.. అంటూ చెప్పాడు బండ్ల గణేష్. ఆ రోజు నేను ఎంతగానో బాధపడ్డాను.. ఆయనతో సినిమా చేసి ఉంటే నాకు ఐదు కోట్లు మిగిలేవి. అలాంటి వ్యక్తిని నేను మోసం చేశాను.. దానికి నేను ఎంతగానో బాధపడ్డాను.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా తప్పకుండా తీర్చుకుంటాను.. ఎట్టకేలకు బండ్ల గణేష్ రవితేజ కి చేసిన మోసం గురించి చెప్పడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యపోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: