ఫుల్ జోష్ లో సినిమాలను ఓకే చేస్తున్న గోపీచంద్..!

Pulgam Srinivas
మ్యాచో స్టార్ గోపీచంద్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరో పాత్రలలో ... విలన్ పాత్రలలో నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటికే తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్న గోపీచంద్ ప్రస్తుతం వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందుతున్న రామబాణం అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేయగా ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే గోపీచంద్ ... శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందినటు వంటి లక్ష్యం ... లౌక్యం అనే రెండు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే రామబాణం మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే గోపీచంద్ తాజాగా మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గోపీచంద్ "రామబాణం" మూవీ తర్వాత హర్ష దర్శకత్వంలో రూపొందిపోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ కి "కే జి ఎఫ్"  మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న రవి బస్రుర్ సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన గోపీచంద్ ప్రస్తుతం మాత్రం వరుస మూవీ లను ఓకే చేస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: