గోపీచంద్ కొత్త సినిమాకు పాన్ ఇండియా సంగీత దర్శకుడు..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ విలన్ గా ... హీరో గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు గోపీచంద్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరో గా కెరియర్ ను మొదలు పెట్టిన గోపీచంద్ ఆ తర్వాత విలన్ గా కొన్ని సినిమాల్లో నటించి తన అద్భుతమైన విలనిజంతో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. విలన్ గా సూపర్ క్రేజీ వచ్చిన తర్వాత గోపీచంద్ తిరిగి మళ్లీ హీరో గా సినిమాల్లో నటించాడు.

అందులో భాగంగా గోపీచంద్ హీరో గా నటించిన అనేక సినిమాలు సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం తో ప్రస్తుతం గోపీచంద్ హీరో గా విజయ వంతంగా తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందుతున్న రామబాణం అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇలా రామబాణం మూవీ సెట్స్ పై ఉండగానే గోపీచంద్ తాజాగా మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. గోపీచంద్ తన తదుపరి మూవీ ని హర్ష దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ కి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతం అందించనున్నాడు. ఈ మూవీ కి ఇప్పటికే కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రవి బుస్రుర్ సంగీతం అందించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: