రుద్రుడు: లారెన్స్ పాన్ ఇండియా ప్రయోగం ఫలిస్తుందా?

Purushottham Vinay
డైరెక్టర్ గా హీరోగా ఇంకా కొరియోగ్రాఫర్ గా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తన టాలెంట్ తో నటుడిగా ఇంకా దర్శకుడిగా మారాడు.హార్రర్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు లారెన్స్.తాజాగా రాఘవ లారెన్స్ నటిస్తున్న సినిమా రుద్రుడు.ప్రియా భవానీ శంకర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తీసుకురావాలని మూవీ మేకర్స్ నిర్ణయించారు. ఇక రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 14వ తేదీన రుద్రుడు సినిమా విడుదల కానుందని మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. సరిగ్గా ఎండా కాలం సెలవుల్లోనే వస్తున్నాడు రుద్రుడు. మంచి టైమింగ్ కోసం చూసిన మేకర్స్ కు ఎట్టకేలకు సూపర్ డేట్ దొరికింది.రుద్రుడు సినిమా షూటింగ్ పార్ట్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయింది.ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


ఈ సినిమాను తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటి దాకా రుద్రుడు నుండి వచ్చిన పోస్టర్స్ లో రాఘవ లారెన్స్ రగ్గడ్ లుక్ లో కనిపించాడు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో అయితే లారెన్స్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.ఇక ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై కతిరేశన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. కతిరేశన్ సినిమాని సమర్పిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ సినిమా రైట్స్ ని దక్కించుకొని రిలీజ్ చేస్తున్నారు.  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రుద్రుడు సినిమాకి ఆర్డీ రాజశేఖర్ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఆంథోనీ, ఇంకా స్టంట్స్ శివ-విక్కీ అందించారు.ఈ సినిమా హిట్ అవుతుందని లారెన్స్ పక్కాగా కాన్ఫిడెంట్ గా వున్నాడు.మరి చూడాలి ఈ సినిమా ఏ విధంగా మెప్పిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: