ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందు అనన్య ఏం చేసేదో తెలుసా.....!!

murali krishna
టాలీవుడ్ లో హీరోయిన్ ఐనా అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటిగా , తెలంగాణ ముద్దుగుమ్మ గా అనన్య నాగళ్ళ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో బాగా పరిచయాన్ని పెంచుకుంది.ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు మరియు అభిమానం కైవసం చేసుకుంది. ఐతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె మొదటిసారి మల్లేశం మూవీ తో నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనన్య ఇందులో ప్రియదర్శి హీరోగా నటించగా ఆయనకు భార్య క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఐతే తర్వాత చేసిన మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ అందుకొని ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిందని చెప్పాలి.ఐతే ప్లే బ్యాక్ అనే సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు అందుకుంది.ముఖ్యంగా వకీల్ సాబ్ మూవీ తర్వాత ఈ అమ్మడు క్రేజీ సడన్ గా పెరగడంతో అందరికీ తన అందాలతో ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
అంతేకాదు ఒకేసారి స్టార్ హీరోల మూవీస్ లలో నటించడంతో ఈమెకు వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. దాంట్లో భాగంగానే గ్లామర్ షో చేయడానికి కూడా వెనకాడడం లేదు ఈ ముద్దుగుమ్మ.అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పటివరకు ఏ తెలుగు హీరోయిన్ చేయని గ్లామర్ షో చేసింది అయినా కూడా ఇప్పుడు అంతగా అవకాశాలు మాత్రం రావట్లేదు. ఇప్పటికీ ఆమె ఏ మూవీ లో నటిస్తుందో అన్న విషయం ఇంకా ఎవరికి కూడా తెలియదు.
ఐతే ఇదిలా ఉండగా నెట్టింట్లో  ఈమెకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారుతుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ముక్కు పెదాలకు సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమె ముఖం మొత్తం మారిపోయింది అన్నట్లుగా తెలుస్తోంది. మొదట్లో చాలా అందంగా ఉండే ఈమె ఈ సర్జరీ తర్వాత అందంగా ఆకట్టుకోలేకపోతోంది.
ఐతే దానికి సంబందించి దేవుడు ఇచ్చిన రూపాన్ని ఎందుకు మార్చుకోవడం అని ఆమె గూర్చి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: