తారకరత్న మొదటి సినిమాకు.. తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

praveen
నందమూరి అనే పేరు తెలియని తెలుగువాడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నట సార్వభౌముడిగా గుర్తింపు సంపాదించుకోవడమే కాదు.. రాజకీయాల్లో కూడా తిరుగులేని నాయకుడిగా ఎదిగి.. తెలుగు ప్రజల గుండెల్లో నందమూరి అనే పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు అని చెప్పాలి. ఇలా నందమూరి అనే మహా వృక్షం కిందే ప్రస్తుతం ఎంతోమంది హీరోలు తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇక నందమూరి నటన వారసులుగా ఎంతోమంది ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా పరిచయమైన వారిలో నందమూరి మోహన్ కృష్ణ తనయుడు తారకరత్న కూడా ఒకరు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు తారకరత్న.

 ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత తాత స్థాపించిన టిడిపి పార్టీలో భాగం అయ్యి పార్టీ గెలుపు కోసం పోరాటం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇటీవలే అనూహ్యంగా సడన్ హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చివరికి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అనే విషయం తెలిసిందే. అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఇక ఇప్పుడు లేడు అన్న విషయాన్ని ఎంతోమంది జీర్ణించుకోలేకపోతున్నారు.

 అయితే తారకరత్న ముందుగా హీరోగా కాకుండా తండ్రి మోహనకృష్ణ, తాత ఎన్టీఆర్ నిర్మించిన కొన్ని సినిమాలకు డిఓపిగా కూడా పనిచేశారట. ఇక తారకరత్న జూబ్లీహిల్స్ లోని భారతీయ విద్యా భవన్లో హైస్కూల్ విద్యను అభ్యసించారట. గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడట. బైక్ రైడింగ్ చేయడం స్నేహితులతో కలిసి వెళ్లడం లాంటివి తారక రత్నకు బాగా ఇష్టమట. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు తారకరత్న.  ఇక అప్పట్లోనే ఒకేరోజు 9 చిత్రాలను అనౌన్స్ చేసి చరిత్ర సృష్టించాడు తారకరత్న.

 అయితే తారకరత్న నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా కోసం తారకరత్న తీసుకున్న రెమ్యూనరేషన్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాను కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. ఈ సినిమా కోసం అన్ని ఖర్చులు కలుపుకొని తారకరత్నకు 10 లక్షల పారితోషకం ఇచ్చినట్లు అశ్విని దత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: