ఎట్టకేలకు వారికి క్షమాపణలు చెప్పిన రితికా సింగ్..!!

Divya
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో సినిమా ప్రెస్మీట్లో తంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిఅర్ ఇచ్చిన టైమ్ కి ప్రెస్ మీట్ లు మొదలుకాదు పూర్తి కాకుండా ఉంటుంది. దీంతో మీడియా మొత్తం గంట తరబడి వెయిట్ చేయవలసి ఉంటుంది.అందులో కొంతమంది అగ్ర హీరోల సినిమాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది హీరోల ఈవెంట్లకు తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కాస్త లేట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఆడియో ఫంక్షన్స్ టీజర్, ట్రైలర్ వంటివి విడుదల చేసేటప్పుడు కాస్త సమయం పడుతుంది.

దీనిపై ఎప్పటికప్పుడు మీడియా ప్రతినిధులు అసహనాన్ని వ్యక్తం తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో ఒకసారి నాని సినిమా విషయంలో కూడా మీడియా ప్రతినిధులు చాలా సీరియస్ గానే వ్యవహరించినట్లు వార్తలు వినిపించాయి. ప్రెస్ మీట్ కి బాగా ఆలస్యం కావడంతో ఆ హీరో ప్రెస్మీట్లో బ్యాన్ చేయాలని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆ తర్వాత హీరో నాని క్షమాపణలు చెప్పడంతో కాస్త సర్దుమని గారు తాజాగా హీరోయిన్ రితికా సింగ్.. నటించిన ఇన్ కార్ ప్రెస్మీట్లో దాదాపుగా అలాంటి సన్నివేశమే చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

రితికా సింగ్ చెప్పిన సమయానికి మీడియా సమావేశానికి అటెండ్ కాకపోవడంలో ఏమేపైన మీడియా ప్రతినిధులు ఆమెపైన ఫైర్ అవుతున్నారు. మీడియా సమావేశానికి మూడు గంటలు కాస్త ఆలస్యంగా రావడంతో ఆమె పైన ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. దీంతో ఈమె కాస్త కంగారు పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనిది దీని ఇలా రివర్స్ అయ్యింది ఏంటి అంటూ ఆమె ఆందోళనకు గురవడం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాను కావాలని లేట్ చేయలేదని మిస్ కమ్యూనికేషన్ కారణంగా కాస్త ఆలస్యమైనట్లుగా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు వివరణ ఇవ్వడం జరిగింది. ఆలస్యమైనందుకు మీడియా వారికి కూడా క్షమాపణలు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: