పూరీ ప్లాన్ ఛేంజ్.. పర్ఫెక్ట్ ప్లాన్..!

shami
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీకి లైగర్ తర్వాత ఛాన్స్ ఇచ్చే హీరో దొరకట్లేదని చెప్పొచ్చు. లైగర్ రిజల్ట్ హిట్ పడుంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ లైగర్ ఫ్లాప్ అవడం పూరీని మళ్లీ వెనక్కి నెట్టేసింది. జన గణ మన అర్ధాంతరంగా ఆగిఓగా తన నెక్స్ట్ సినిమా చేయడానికి హీరో కూడా దొరకని పరిస్థితి. అయితే మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో పూరీ చిన్న రోల్ చేశాడు. ఆ చనువుతో చిరుకి మరో కథ వినిపించాడట పూరీ. లైన్ బాగున్నా డెవెలప్ మెంట్ లో మళ్లీ పూరీ రొటీన్ మార్క్ కనిపించే సరికి చిరు మళ్లీ నో చెప్పినట్టు టాక్. ఇక రవితేజ అయినా ఛాన్స్ ఇస్తాడేమో అనుకుంటే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే పూరీ తనయుడు ఆకాష్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.
కానీ ఆకాష్ తో సినిమా పక్కన పెట్టి మరోసారి రామ్ తో సినిమాకు లైన్ చేస్తున్నాడట పూరీ జగన్నాథ్. ఆయన ఫాం లో లేనప్పుడు కూడా ఇస్మార్ట్ శంకర్ ఛాన్స్ ఇచ్చాడు రామ్. మరోసారి పూరీ కి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. రాం తో పూరీ ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఉంటుందని టాక్. అంతేకాదు ఈ సినిమాకు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారట.
సో మరోసారి పూరీ, రామ్ ల కాంబో ఆడియన్స్ ని అలరించనుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రాం కూడా మాస్ హిట్ అందుకోగా పూరీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఆ తర్వాత లైగర్ ఫ్లాప్ ఆయన్ను మళ్లీ రిస్క్ లో పడేలా చేసింది. అయితే ఈ టైం లో పూరీని నమ్మి ఛాన్స్ ఇస్తున్నాడు రామ్ సో అతని నమ్మకాన్ని పూరీ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: