మహేష్ ... రాజమౌళి మూవీ లేటెస్ట్ అప్డేట్..!

Pulgam Srinivas
ప్రస్తుతం ఇండియా లోనే అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కెరియర్ లో దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోనూ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

అలాగే అంతర్జాతీయ వేదికల్లో ఈ సినిమాకు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డు లు కూడా దక్కాయి. ఈ మూవీ ద్వారా రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగి పోయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడు గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో రూపొందించ బోతున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 29 వ మూవీ గా రూపొందబోతుంది. ప్రస్తుతం మహేష్ బాబు ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాజమౌళి సినిమా షూటింగ్ లో మహేష్ జాయిన్ కాబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రారంభించనున్నట్లు ... ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఈ సంవత్సరం చివరన ప్రారంభించనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ ని దర్శకుడు రాజమౌళి ఫారెస్ట్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించ బోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఈ మూవీ పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: