నాని... ఆత్రేయ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికి ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సంతోష్ నారాయణ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నాని ఆఖరుగా అంటే సుందరానికి అనే మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో నజ్రియా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి మూవీ అనుకున్నంత రేంజ్ విజయం సాధించక పోయినప్పటికీ నాని మరో సారి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి విcవి దానయ్య నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... నాని ... వివేక్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ లో ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ లో పవర్ఫుల్ విలన్ పాత్రలో ఏ నటుడిని తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: