రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్.. పాత్ర ఏంటో తెలుసా?

praveen
జీవిత రాజశేఖర్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా తన హవా నడిపించింది. అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది జీవిత రాజశేఖర్. ఇక ఆ తర్వాత కాలంలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా స్టార్ హీరోగా హవా నడిపించిన రాజశేఖర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత పూర్తిగా తన కెరీర్ కు స్వస్తి పలికింది జీవిత రాజశేఖర్. అప్పటినుంచి ఏ సినిమాలో నటించలేదు. అయితే సీనియర్ హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో సినిమాల్లో నటిస్తున్న.. జీవిత రాజశేఖర్ మాత్రం మళ్లీ నటన జోలికి రాలేదు అని చెప్పాలి.

 ఇకపోతే నటన విషయంలో దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా దర్శకురాలిగా మాత్రం తన సత్తా చాటింది జీవిత రాజశేఖర్. ఇకపోతే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నటనలోకి అడుగుపెట్టబోతుంది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. లాల్ సలాం అనే టైటిల్ తో భారీ ప్రాజెక్టు ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తూ ఉంది అని చెప్పాలి. కాగా ఐశ్వర్య కి దర్శకురాలిగా ఇది మూడో సినిమా. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ఇద్దరు కూడా కథానాయకులుగా కనిపించబోతున్నారు అన్నది తెలుస్తుంది.  ఇక ఇదే సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.

 ఇక ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ నటించబోతుంది అన్న వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఇక ఈ సినిమాలో ఒక పాత్ర కోసం జీవిత రాజశేఖర్ అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతారని దర్శకురాలు ఐశ్వర్య భావించింద..ట ఈ క్రమంలోనే ఆమెను కలిసి కథ వినిపించడమే.. కాదు తప్పకుండా ఈ పాత్ర మీరే చేయాలని ఒప్పించిందట ఐశ్వర్య. కాగా ఈ సినిమాలో జీవిత, రజినీకాంత్ చెల్లెలిగా నటించబోతున్నట్లు టాక్ ఉంది. ఇక మార్చి మొదటి వారంలోనే చెన్నైకి వెళ్లే జీవిత అక్కడ షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతుందట. ఇక చాలా ఏళ్ల తర్వాత జీవిత చేస్తున్న పాత్ర కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: