పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా.. హీరోయిన్ లయ ఏం చెప్పిందంటే?

praveen
ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ సినీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అయితే అచ్చం ఇలాగే ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నామా లేదా అనే విధంగా కొంతమంది హీరోయిన్ల కెరియర్ సాగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక అలాంటి హీరోయిన్లలో లయ కూడా ఒకరు. స్వయంవరం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది లయ. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి..

 అంతే కాదు హోమ్లీ హీరోయిన్ గా కూడా ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మనోహరం, మనసున్న మారాజు, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, శివరామరాజు స్వరాభిషేకం లాంటి సూపర్హిట్లను కూడా ఖాతాలో వేసుకొని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ హీరోయిన్. అంతేకాదు ఇక తన నటనతో ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను కూడా అందుకుంది అని చెప్పాలి. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోయింది. నటనకు పూర్తిగా దూరమైంది. ఇక సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈ అమ్మడు ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇటీవలే ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా అంటూ లయకు ప్రశ్న ఎదురయింది. ఇక ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే ఛారిష్మా ఉంది. ఆయన అవతారా లేదా అనేది జనాలు డిసైడ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే సీఎం కూర్చీకే కొత్త వైభవం వస్తుంది. సీఎం అయినా అవ్వకపోయినా ఆయన ఎప్పుడూ టామ్ పోసిషన్ లోనే ఉంటాడు అంటూ లయ సమాధానం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: