భువనవిజయం పై పెరిగిపోతున్న అంచనాలు !

Seetha Sailaja

సాహిత్యం పై అభిరుచు ఉన్న వారికి భువనవిజయం పదం సుపరిచితం. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండే అల్లసాని పెద్దన తెనాలి రామకృష్ణుడు లాంటి ఎందరో గొప్ప కవులతో కూడిన వేదిక భువనవిజయం. అలాంటి పేరును ఒక చిన్న సినిమాకు టైటిల్ గా పెట్టడం అన్నది ఒకవిధంగా సాహసం. అయితే అలాంటి సాహసాన్ని ఒక యంగ్ డైరెక్టర్ చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అనేకమంది కామెడీ ఆర్టిస్టులను కలిపి ఒక కామెడీ థ్రిల్లర్ మూవీగా చేస్తున్న ప్రయత్నానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఆ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది.

సునీల్ శ్రీనివాసరెడ్డి వెన్నెల కిశోర్ పృధ్వీ వైవా హర్ష బిగ్ బాస్ వాసంతి ధన్ రాజ్ లతో పాటు అనేకమంది కామెడీ ఆర్టిస్టులు ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంచుమించు పూర్తి కావడంతో ఈమూవీని అనేక భారీ మీడియం రేంజ్ సినిమాలు విడుదల అవుతున్న సమ్మర్ రేస్ లో క్రేజీ సినిమాలకు పోటీగా విడుదల చేస్తూ ఉండటంతో ఈ మూవీలో అంతటి సత్తా ఉందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి.

రాబోతున్న సమ్మర్ రేస్ లో ఒక రవితేజా తప్ప మిగతా టాప్ హీరోల సినిమాలు ఏమీ రావడంలేదు. మీడియం రేంజ్ సినిమాలలో నాని ‘దసరా’ అఖిల్ ‘ఏజెంట్’ మూవీలతో పాటు మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు మధ్య సమంత ‘శాకుంతలం’ కూడ విడుదల కాబోతోంది. సమ్మర్ సీజన్ మూడు నెలలు ఉంటుంది కాబట్టి చాల చిన్న సినిమాలు కూడ తమ అదృష్టాన్ని ఈసమ్మర్ సీజన్ లో పరీక్షించుకొబోతున్నాయి.

ఇన్ని సినిమాల మధ్య విడుదల కాబోతున్న ‘భువనవిజయం’ లో ఎదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘జాతిరత్నాలు’ ‘డీజే టిల్లు’ లాంటి సినిమాలకు రూపాయి పెట్టుబడి పెట్టిన వారికి 10 రూపాయల లాభం వచ్చింది. మరి అలాంటి అదృష్టం ‘భువనవిజయం’ బయ్యర్లకు ఉంటుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: