వేశ్య పాత్రలో ఆ హీరోయిన్..!

shami
మళయాళ నుంచి వచ్చిన భావన మీనన్ తెలుగులో గోపీచంద్ తో ఒంటరి, శ్రీకాంత్ తో మహాత్మ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో అమ్మడు తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. అయితే స్టార్ సినిమాల ఛాన్స్ లు రాలేదు కానీ వచ్చుంటే మాత్రం ఇక్కడ స్టార్ క్రేజ్ దక్కించుకునేది. కానీ ఆ మధ్యలో లైంగిక దాడి కేసులో ఆమె అంతటా హాట్ న్యూస్ గా మారింది. ఆ టైం లోనే ఆమెకు వచ్చిన సినిమా ఛాన్స్ లు కూడా కోల్పోయింది. అయితే బిజినెస్ మెన్ తో పెళ్లాడిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమాల్లో నటిస్తుంది భావన.
మళయాళంలో అమ్మడు సినిమాలు చేస్తుంది. అయితే తెలుగు ఆడియన్స్ కు ఎలాగు ఆమె సుపరిచితురాలు కాబట్టి ఆమెని తెలుగులో నటింప చేయాలని చూస్తున్నారు. అంతకుముందు ఒకటి రెండు సపోర్టింగ్ రోల్స్ వచ్చినా భావన చేయనని చెప్పిందట. అయితే లేటెస్ట్ గా అమ్మడికి తెలుగు నిర్మాత బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేంటి అంటే ఆమెతో ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాలో ఆమెది వేశ్య పాత్ర అని తెలుస్తుంది. భావనని అంతకుముందు క్లాస్ హీరోయిన్ గా చూశారు. ఇప్పటికీ ఆమెని అలా ఊహించుకుంటారు.
కానీ సదరు నిర్మాత ఆమెతో ఒక బోల్డ్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆమె ఒప్పుకుంటే ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారట. మరి భావనతో ఆ నిర్మాత చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఈ సినిమా విషయంలో భావన తెలుగు ఫ్యాన్స్ మాత్రం సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఆమె ఈ సినిమా చేస్తే మాత్రం తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు సంబంధిచిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: