రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన విశ్వక్ సేన్.. ఎన్ని కోట్లో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో విశ్వక్ సేన్ ఒకడు. హీరో గానే కాకుండా డైరెక్టర్గా, రైటర్ గా తనకంటూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా వాటిలో హిట్స్ ఎక్కువ ఉండడంతో విశ్వక్ సేన్ కి మాస్ హీరోగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే విశ్వక్ సేన్ ని ఫ్యాన్స్ మాస్ కా దాస్ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరో 'ధమ్కీ' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరో గానే కాకుండా దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టాడు. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్న కథ అందించగా.. విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తున్నాడు. 

ఇక సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా.మ్ నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే విశ్వక్ సేన్ తాజాగా తన రెమ్యునరేషన్ని భారీగా పెంచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో పాటు తన సినిమాలకి మంచి బిజినెస్ కూడా జరుగుతుండడంతో.మ్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4.5 నుంచి 5 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక ఈ హీరోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రొడ్యూసర్స్ కూడా అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది.

ఇక దమ్కీ విషయానికొస్తే.. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదల కావాలి. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా విడుదలను వాయిదా వేసింది మూవీ టీంమ. కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా విడుదలను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించనుంది. అందుతున్న సమాచారం ప్రకారం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా అనంతరం విశ్వక్ సేన్ తన డైరెక్షన్లో 'ఫలక్ నామా దాస్' సినిమాకి సీక్వెల్ చేయనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: