ప్రభాస్ కి తాతగా బాలీవుడ్ నటుడు..?

Anilkumar
ప్రభాస్ - మారుతి సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా జరుగుతుంది. హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు ఈ సినిమాలో ప్రభాస్ కి తండ్రి పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తాడని వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రభాస్ కు తాతగా కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ఆయన కూడా ఈ సినిమా షూటింగ్లో భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 20% టాకీ పాటు పూర్తయింది. ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ ను మార్చి రెండో వారం నుంచి ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ గ్యాప్ లో ప్రభాస్ అటు తన సలార్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. సలార్ షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. ఇంకా కొద్ది భాగం మాత్రమే షూటింగ్ మిగిలింది. మారుతి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు ప్రభాస్ సలార్ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తాడట. ఆ తర్వాత మళ్లీ యధావిధిగా మారుతి సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్ నటిస్తున్నారు.

మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ మారుతి సినిమాకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ బయటికి రాలేదు. షూటింగ్ మొత్తం పూర్తయ్యేంత వరకు ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకూడదని మూవీ టీం ఫిక్స్ అయిందట. ఎందుకంటే సలార్, ఆది పురుష్ సినిమాలకు ఇది కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉన్న కారణంగా సినిమా అప్ డేట్స్ ని హోల్డ్ లో పెట్టిన తెలుస్తోంది. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ప్రాజెక్టు కే అదే సంక్రాంతికి విడుదల అవుతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. దీన్నిబట్టి ప్రాజెక్టు కే తర్వాతే ప్రభాస్ మారుతి సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: