పవన్ సినిమాలో పూజ హెగ్డే కి ఊహించని షాక్..తన ప్లేస్ లో ఆ స్టార్ హీరోయిన్..!?

Anilkumar
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ మరియు హరిష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఇటీవల చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. వచ్చే నెలలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 35 రోజులకు పైగానే డేట్స్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ,తేరి ,భవదీయుడు భగత్ సింగ్ ఈ అన్ని సినిమాలు కూడా ఒకదాని వెంట ఒకటి రానున్నాయి. ఇక ఈ సినిమాలో భార్య హత్య, చిన్నారి ఎపిసోడ్లు ,సామాజిక అంశాలని తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ ని తెరకెక్కించబోతున్నట్లుగా..

టాలీవుడ్ లో ప్రస్తుతం వార్తలయితే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా పూజ హెగ్డే ని హీరోయిన్గా అనుకున్నారు .ఈ సినిమా ప్రారంభంలోనే పూజ హెగ్డే ని ఫైనల్ కూడా చేశారు హరీష్ శంకర్. గతంలో హరిష్ శంకర్ మరియు పూజా కాంబినేషన్లో డీజే, గద్దెలకొండ గణేష్ వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఆ పరిచయం కారణంగానే పూజా హెగ్డే ని ఈ సినిమాలో పవన్ కి జోడిగా పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ మారింది అన్న ప్రచారం జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో మరొక కొత్త హీరోయిన్ పేరు అయితే వినిపిస్తుంది. 
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని సెన్సేషన్ గా మారిన శ్రీ లీలని ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకుంటున్నారని తెలుస్తోంది.అయితే శ్రీల ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఉండబోతుందా లేదా సెకండ్ హీరోయిన్ గా ఉండబోతుందా అన్న విషయం పై క్లారిటీ లేదు. ఒకవేళ శ్రీ లీలా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తే మాత్రం అది పూజా హెగ్డే కి పెద్ద షాక్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా దర్శకుడు హరి శంకర్ శ్రీ లీలని మెయిన్ హీరోయిన్ గా పెడతాడా లేదా పూజ హెగ్డే ని మెయిన్ హీరోయిన్ గా పెడతాడా అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: