మహేష్ త్రివిక్రమ్ ల సినిమాకు సెంటిమెంట్ తాత !

Seetha Sailaja
త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సంభాషణలను ఎంతో పదునుగా మరింత పొదుపుగా వ్రాస్తాడో అతడి సినిమా టైటిల్స్ కు సెంటిమెంట్ కూడ చాల ఎక్కువ. అతడి సినిమాలలో ‘అ’ అక్షరంతో మొదలై టైటిల్ తో వచ్చిన సినిమాలు బ్లాక్ బష్టర్ హిట్ గా మారాయి. దీనితో మహేష్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీ కూడ అలాంటి టైటిల్ సెంటిమెంట్ తో వస్తుందా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసినీ భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీలో త్రివిక్రమ్ సెంటిమెంట్ హీరోయిన్ పూజా హెగ్డే అలాగే గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల తో పాటు అనేకమంది ప్రముఖ నటీనటులు ఈమూవీలో నటిస్తున్నారు. ఈమూవీలో మరొక సెంటిమెంట్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ సినిమాలలో తాత పాత్రకు చాల ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యతతో వచ్చిన ‘అతడు’ ‘అత్తారింటికి దారేది’ ‘అల వైకుంఠ పురములో’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇప్పుడు మహేష్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీలో కూడ ఒక కీలకమైన తాత పాత్ర ఉంటుందట. ఈ తాత పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈమూవీలో ప్రకాష్ రాజ్ మహేష్ ల మధ్య వచ్చే సంభాషణలు చాల వెటకారపు ద్వనితో ప్రేక్షకులకు నవ్వు తెప్పించే విధంగా త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి త్రివిక్రమ్ తీసే ప్రతి సినిమాకు ఒక పాత సినిమాతో లింక్ కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు ఈ తాత పాత్ర వార్తలు బయటకు రావడంతో త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న సినిమాలో కూడ ఏదైనా పాత సినిమా ఛాయలు కనిపిస్తాయా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈసారి ఆగష్టు 15కు వరస సెలవలు రావడంతో ఆడేట్ ను టార్గెట్ చేస్తూ ఈమూవీని విడుదల చేయాలని త్రివిక్రమ్ చాలగట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: