పవన్ కళ్యాణ్ పొరపాటు వెనుక ఆంతర్యం !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుండి 5 విభాగాలలో అవార్డులు పొందినందుకు ఇండస్ట్రీలోని అనేకమంది ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ ను ముఖ్యంగా రాజమౌళి కీరవాణి చరణ్ జూనియర్ లను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని తెలియచేస్తున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖుల దగ్గర నుండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నూతన నటీనటుల నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ కు అభినందనలు తెలియచేస్తున్నారు.

దీనికితోడు హాలీవుడ్ క్రిటిక్స్ నుండి రామ్ చరణ్ నటనకు మంచి ప్రశంసలు కూడ లభించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ అవార్డ్స్ కు సంబంధించిన ప్రకటన వెలువడిన వెంటనే పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటన పై ఇప్పుడు ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. పవన్ ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ను ముఖ్యంగా రాజమౌళి రామ్ చరణ్ లను అభినందించి జూనియర్ పేరును ప్రస్తావించక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

వాస్తవానికి చరణ్ జూనియర్ ల మధ్య చాలామంచి స్నేహం కొనసాగుతోంది. చిరంజీవి కూడ చరణ్ జూనియర్ లు తమ స్థాయిని పక్కకు పెట్టి మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఉండటం ఇండస్ట్రీకి ఒక మంచి శుభపరిణామం అంటూ అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు. అదేవిధంగా పవన్ కూడ తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉండాలా లేకుంటే ఒక పొత్తును ఏర్పాటు చేసుకుని రాబోతున్న ఎన్నికలలో కలిసి పోటీ చేయాలా అన్న విషయమై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు.

ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ తన అభినందనలు తెలియచేస్తూ విడుదలచేసిన ప్రకటనలో జూనియర్ పేరు ఎందుకు ప్రస్తావించలేదు అన్నవిషయమై ఎవరికీ సమాధానం దొరకడంలేదు. ఒకవేళ పొరపాటున జూనియర్ పేరు ఆ మెసేజ్ లో రాలేదు అనుకుంటే రాజకీయాలలో ఆచితూచి అడుగులు వేస్తున్న పవన్ ఇలాంటి సున్నిత విషయాలు అనవసరమైన ఇబ్బందులకు దారి తీస్తాయని తెలిసే ఉంటుంది కదా అంటూ మరికొందరు తమ సందేహాలను వ్యక్త పరుస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: