సాయి ధరమ్ తేజ్ కథతో శర్వానంద్ బ్లాక్ బాస్టర్ హిట్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథను మరో హీరోతో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఒక హీరోతో అనుకున్న కథను మరో హీరోతో తెరకెక్కించడానికి అనేక కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో హీరోకు ఆ కథ నచ్చకపోవడం ... అలాగే హీరోకు ఆ సమయంలో కథ నచ్చినప్పటికీ ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల కూడా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. అలా వదులుకున్న సినిమాలు వేరే హీరోతో తెరకెక్కిన సందర్భాలలో బ్లాక్ బాస్టర్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న హీరోలలో ఒకరు అయినటు వంటి సాయి దరమ్ తేజ్ ఒక కథను వదులుకోగా ... ఆ కథను శర్వానంద్ తో తెరకెక్కించగా ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏమిటి ... ఆ వివరాలు తెలుసుకుందాం.


తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన శర్వానంద్ ఇప్పటికే ఎన్నో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అలా శర్వానంద్ కెరియర్ లో మంచి విజయం అందుకున్న సినిమాలలో శతమానం భవతి సినిమా ఒకటి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా ద్వారా శర్వానంద్ కు మంచి గుర్తింపు మరియు అద్భుతమైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథను మొదటగా టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ కు ఈ మూవీ యూనిట్ వినిపించిందట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ నటించలేక పోయినట్లు ... దానితో ఇదే కథను శర్వానంద్ వినిపించగా శర్వానంద్ ఈ మూవీ లో నటించడానికి ఒకే చెప్పడంతో ఈ మూవీ ని శర్వానంతో చేసినట్లు తెలుస్తోంది. ఇలా సాయి ధరమ్ తేజ్ కోసం తయారు చేసిన కథతో శర్వానంద్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: