పవన్ సినిమాకి బాలయ్య టైటిల్..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది రీమేక్ గా రూపొందుతోంది. విలక్షణ నటుడు సముద్రకని ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రీమేక్ కి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి 'దేవుడు' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. చాలా సంవత్సరాల క్రితం ఇదే టైటిల్ తో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. 

అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకో లేకపోయింది. దీంతో మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య మూవీ టైటిల్ను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఫిక్స్ చేయడంతో ఈ విషయంలో ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది. నిజానికి దీని కంటే ముందు ఈ రీమేక్ కి దేవర అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలని అనుకున్నా.. కథకు అనుగుణంగా మేకర్స్ 'దేవుడు' అనే టైటిల్ పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా ఈ నెలాఖరులోగా సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ విషయంలో

 ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే కేటాయించారు పవన్ కళ్యాణ్. దీని ప్రకారం ఒక రోజుకు నాలుగు కోట్ల రేంజ్ లో పవన్ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే సముద్రఖని దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విలక్షణ నటుడిగా టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు సముద్రఖని. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అన్నట్టు ఈ సినిమా కోసం సముద్రఖని కూడా భారీ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: