శంకర్ 1000 కోట్ల ప్రాజెక్ట్ కి హీరో దొరికేసాడు..?

Anilkumar
ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆర్సి15 అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆర్ సి 15 తో పాటు ఇండియన్ 2 సినిమా షూటింగ్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు శంకర్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకుడు శంకర్ ఓ చారిత్రాత్మక సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఈ మేరకు సువేంకటేశన్ రచించిన 'వేల్పూరి' అనే నవల ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాని తెలుగు తెరకెక్కించాలంటే అక్షరాల 1000 కోట్ల బడ్జెట్ అవుతుందట. అంతేకాదు ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తాడట దర్శకుడు శంకర్. అయితే ఈ భారీ ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ సూర్య లీడ్ రోల్ చేస్తున్నారని అలాగే కేజీ ఆఫ్ స్టార్ యష్, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారని గత కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులో దర్శకుడు శంకర్ హీరోగా తీసుకోవాలనుకుంది దళపతి విజయ్ ని అని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే శంకర్ విజయ్ కి ఈ కథను వినిపించాడట. ఈ కథ విజయ్ కి కూడా బాగా నచ్చిందట.

గతంలో ఒకే ఒక్కడు సినిమాను శంకర్ విజయ్ తోనే తీయాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుని విజయ్ తోనే తీయబోతున్నాడట. ఇక విజయ్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ భారీ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాలుస్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం తలపతి విజయ్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో 'లియో' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత మళ్లీ వంశీ పైడిపల్లి తో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ తర్వాతే శంకర్ తో విజయ్ సినిమా చేసే ఛాన్స్ ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: