టాలీవుడ్ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పూజా హెగ్డే..!?

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది పూజా హెగ్డే. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఆమె పేరు మారుమ్రోగుతుంది అని చెప్పాలి. కెరియర్ మొదట్లో ఆమె సినిమా చాన్స్ లేక చాలా ఇబ్బందులు పడింది. అనంతరం మహర్షి సినిమా తర్వాత నుండి ఆమెకి స్టార్ డం పెరిగిపోయింది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ హిట్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్గా వెలుగుతోంది పూజ హెగ్డే. అదే సమయంలో హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే వరుసగా మూడు సినిమాలు చేసింది .

ఇక ఆమె వరుసగా చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అంతేకాదు మీడియా కూడా ఆమెని పెద్దగా హైలెట్ చేయట్లేదు సాధారణంగా ఏ హీరో హీరోయిన్ అయిన సరే హిట్లు ఉన్నంతకాలమే వారిని హైలెట్ చేస్తారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న పూజ హెగ్డే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇండస్ట్రీలో ఇట్లున్నంతకాలమే మనకు క్రేజ్ ఉంటుంది.. ఒకసారి ఫ్లాప్ వస్తే మనల్ని ఎవరూ పట్టించుకోరు.. అంతేకాదు చాలా నెగిటివ్గా మన గురించి మాట్లాడుతారు.. నేను మాత్రం అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను..

ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఏవి ఎదురైనా వాటన్నిటిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. నాకు హిట్ పడ్డా ఫ్లాప్ పడ్డ నన్ను అభిమానించేవారు చాలామంది ఉన్నారు.. అలాంటి వారి కోసమే నేను ప్రస్తుతం సినిమాల్లో చేస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే .దీంతో పూజా హెగ్డే మాటలు విన్న చాలామంది ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకొని పూజా హెగ్డే ఇలాంటి వ్యాఖ్యలను చేసింది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోల గురించి పూజ హెగ్డే ఇలా మాట్లాడింది అంటూ కామెంట్లను చేస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: