ఆ సీనియర్ హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయిన మిస్ ఇండియా..!?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ సినిమాలో నటించిన నాగార్జున ఇప్పుడు మరో కొత్త సినిమాతో రానున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మరో సినిమాతో తన సత్తాను చాటడానికి రెడీ అయ్యారు నాగార్జున. మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ తెరకెక్కించిన మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేస్తున్నాడు అంటూ ఇప్పటికే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు నాగార్జున మాత్రం ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన నాగార్జున తన దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటిదాకా తెలియదు. ఈ క్రమంలోని ఈ సినిమాలో హీరోయిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మిస్ ఇండియా హీరోయిన్గా నటిస్తుందని సమాచారం.

మిస్ ఇండియా మానస వారణాసి ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది అంటున్నారు.అంతేకాదు ఇప్పటికే నాగార్జున మరియు మానస వారణాసికి సంబంధించిన ఫోటోషూట్లను కూడా చిత్ర బృందం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున కి జోడిగా మిస్ ఇండియా మానస వారణాసి ఫిక్స్ అయిందని వార్తలు అయితే వస్తున్నాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా బయటికి రాలేదు .ఈ సినిమాలో మిస్ ఇండియా హీరోయిన్గా ఫిక్స్ అయ్యిందా లేదా అన్నది తెలియలంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: