'ఉస్తాద్ భగత్ సింగ్' కి హీరోయిన్ ఫిక్స్..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఒకటి. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాని గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగ రాసిన విషయం తెలిసిందే. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కథ తమిళంలో హిట్ అయిన విజయ్ తేరి సినిమా నుండి తీసుకున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. 

అయితే అది నిజమేనని కాకపోతే మొత్తానికి రీమేక్ సినిమా కాదని కేవలం ఆ మూవీ నుంచి ఐడియా మాత్రమే తీసుకొని దాన్ని సొంతంగా హరీష్ శంకర్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను డెవలప్ చేసినట్లు దర్శకుడు దశరథ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాకి హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారట మూవీ యూనిట్. లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయిందట. డైరెక్టర్ హరిష్ శంకర్ ఈ హీరోయిన్ డేట్స్ ఎప్పుడు అడిగినా కూడా ఆమె ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే హరీష్ శంకర్ అడగకముందే పూజా హెగ్డే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డేట్స్ ఇచ్చేసిందట. ఇక పవన్ కళ్యాణ్ తో పూజా హెగ్డే మొదటిసారి జోడి కడుతుండడంతో ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపిస్తాడని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: