అల్లు అర్జున్ స్టార్ హీరో అవ్వడానికి కారణం ఎవరో తెలుసా...?

murali krishna
అల్లు అర్జున్‌ ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగాఅయితే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఐకాన్ స్టార్ దూసుకుపోతున్నాడు.
ఆయన చేతిలో ఇప్పుడు అన్నీ కూడా బడా ప్రాజెక్టులే ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప తర్వాత ఆయన ఇమేజ్‌ కూడా అమాంతం డబుల్ అయిపోయింది. అయితే అసలు బన్నీ స్టార్ హీరో కావడానికి కారణం నితిన్‌ చేసిన ఆ పనేనా.
ఆయన పొరపాటు వల్లే అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యాడని ఇన్నాళ్లకు ఓ నిజం అయితే బయట పడింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసు కుందాం. అల్లు అర్జున్ అప్పట్లో స్టార్ హీరోను చేసిన సినిమా ఆర్య. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ వెనక్కు తిరిగి చూసుకోకుండా కెరీర్ లో దూసుకు పోయాడు. అయితే దీనికి సుకుమార్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మాతగా అయితే వ్యవహరించాడు.
అప్పట్లో నితిన్‌ జయం సినిమా హిట్ తో మంచి ఫామ్‌ లో అయితే ఉన్నాడు. కాబట్టి నితిన్‌ తండ్రి ఆర్య సినిమా కథను విని ఎలాగైనా తన కొడుకుతో చేయించాలని గట్టిగా అనుకున్నాడు. అనుకున్నట్టు గానే దిల్‌ రాజు వద్దకు వెళ్లాడు. కానీ సుకుమార్‌ ఆ సినిమాను వెంటనే తీయాలనే పట్టుదలతో అయితే ఉన్నాడు.
కానీ నితిన్‌ చేతిలో అప్పటికే అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. దాంతో నితిన్‌ డేట్లు అస్సలు అడ్జస్త్ కాలేదు.చేసేది లేక ఆ సినిమాను వదులుకున్నాడట నితిన్. దాంతో ఈ కథ అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి ఆగిందని తెలుస్తుంది.. ఆ మూవీ పెద్ద హిట్ అయి అల్లు అర్జున్ ని ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరో ను చేసింది.ఆర్య సినిమా తరువాత అల్లు అర్జున్ వినాయక్ తెరకెక్కించిన బన్నీ సినిమాలో నటించాడు.ఆ సినిమా తో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: