ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్..!?

Anilkumar
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోయేది లావణ్య త్రిపాఠినే  అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. నాగబాబు ఇటీవల  ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .ఇక ఇంటర్వ్యూలో నాగబాబు త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఒక సీక్రెట్ ను రివిల్ చేశాడు. దీంతో ఈ వార్త విన్న అందరూ వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోయేది లావణ్య అని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో మిస్టర్ అంతరిక్షం సినిమాలో వచ్చాయి .ఇక వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. 

అంతేకాదు వీరిద్దరూ చాలా ప్రైవేట్ పార్టీలలో కూడా కలుస్తూ ఉంటారు. దీంతో వారి ఫోటోలను చూసిన చాలామంది త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోని ఈ వార్తలపై స్పందించారు నాగబాబు మరియు లావణ్య త్రిపాఠి. ఇందులో భాగంగానే వారిద్దరూ మాట్లాడుతూ మీరు అనుకున్నట్లు అదేమీ లేదు అంటూ స్పష్టం చేశారు. తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన ఒక కామెంట్ మరోసారి ఆ వార్తలు నిజమే అని నమ్మేటట్లుగా చేసింది.తాజాగా లావణ్య త్రిపాఠి నటించిన సినిమా పులి మేక .ఇక ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ సిరి కూడా ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సుమ అడ్డా షో కి వచ్చారు సినిమా యూనిట్.

అయితే ఆ షోలో భాగంగా సుమా లావణ్య త్రిపాఠిని ఒక ప్రశ్న అడుగుతుంది..మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అని అడిగితే ఊహించని సమాధానం చెప్పింది లావణ్య త్రిపాఠి. ఇక ఇందుకు సుమ ఆప్షన్స్ ను ఇచ్చింది ఏ నాని బి వరుణ్ తేజ్ అని చెప్పడంతో వెంటనే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ అని ఆన్సర్ ఇచ్చింది. దీంతో తన సమాధానం విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలోని వరుణ్ తేజ్ లావణ్య నే పెళ్లి చేసుకుంటాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక ఇలా వరుసగా తన పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆ పెళ్లి వార్తలపై వరుణ్ తేజ్ స్పందించాల్సి ఉంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: