సౌందర్య చనిపోవడానికి ఆ ఇల్లే కారణమా.. !?

Anilkumar
జంబలకడిపంబ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మొదటిసారి తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన ఆమని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమాతో పాటు మరెన్నో సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సీనియర్ హీరోయిన్. హీరోయిన్ గా ఫేడ్ అవుట్  అయినప్పటికీ ఈమె చాలా సినిమాల్లో అమ్మ ,వదిన ,అక్క పాత్రలో నటిస్తూ ఇప్పటికీ అందరినీ అలరిస్తూనే ఉంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఇక ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రాణ స్నేహితురాలు అయిన సౌందర్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అయితే ఒకప్పుడు అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ స్టార్ హీరోయిన్గా

 ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఆమని. ప్రస్తుతం హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది ఈ సీనియర్ హీరోయిన్. అయితే హీరోయిన్ గా ఈమె రాణిస్తున్న సమయంలో ఆమనికి ఎంతటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో అప్పట్లో ఏమీ చాలా బిజీగా ఉండేది. అంతేకాదు స్టార్ హీరోల సరసన అనేక సినిమాలలో నటించి మెప్పించిన ఈమె ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫ్యామిలీ సినిమాల ద్వారా బాగా దగ్గరయింది. సినీ ఇండస్ట్రీలో తనకి ఎవరైనా దగ్గర స్నేహితులు ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సౌందర్యనే అని చెప్పాలి. ఈ సందర్భంగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె సినీ ఇండస్ట్రీలో నాకు ఎవరైనా స్నేహితురాలు ఉన్నారు అంటే

అది కచ్చితంగా సౌందర్య అని.. అంతేకాదు తనను బాగా కలచివేసిన  సంఘటనలు సౌందర్య మరణం అని.. సౌందర్య నేను చాలా స్నేహంగా ఉండే వాళ్ళమని చెప్పుకొచ్చింది ఆమని.. సౌందర్య తో కలిసి ఎన్నో సినిమాలలో చేశాను అని.. ఆ సమయంలో చాలా విషయాలను మేమిద్దరం కలిసి పంచుకునే వారమని.. ఇకపోతే సౌందర్య చనిపోయిన సమయంలో నేను ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను అని ఆ విషయం తెలియగానే నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయిందని సౌందర్య ని ఆ పరిస్థితుల్లో చూడడం నావల్ల కాలేదు అని చెప్పుకొచ్చింది.. అనంతరం సౌందర్య చనిపోయిన తర్వాత తన కుటుంబాన్ని పరామర్శించానని.. ఇక సమయంలో సౌందర్య తల్లి మాట్లాడుతూ... సౌందర్య లేని చూడలేకపోయానని కొత్త ఇంట్లోకి మారిన తర్వాతే ఈ ఘోరం జరిగింది అంటూ కన్నీళ్లు పెట్టుకుందట సౌందర్య తల్లి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: