ఆ మూవీలో పవర్ స్టార్ అభిమానిగా మెగాస్టార్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ అపిరెన్స్ ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలాగే మెగాస్టార్ ను పవర్ స్టార్ ను కలిపి చూడటానికి మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమాలో పాటలో అలా వచ్చి ఇలా వెళ్ళుపోయారు పవన్ కళ్యాణ్. ఇంకా అలాగే ఆ తరువాత వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించి ఎంతగానో అలరించారు పవన్ కళ్యాణ్. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి కనిపించనున్నారు అంటూ ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. దాంతో మెగా ఫ్యాన్ అందరూ కూడా ఆనందంలో తెగ తేలిపోతున్నారు. అయితే ఇప్పుడు ఇక అసలు విషయం ఏంటంటే..


టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. స్టైలిష్ డైరెక్టర్ మెహార్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.అయితే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఇంకా అలాగే చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ను కూడా ఈ మూవీలో రీమిక్స్ చేయనున్నారని సమాచారం వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత వున్నదో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలొనే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: