ఆ డైరెక్టర్ పాన్ ఇండియా స్థాయిలో ' డార్లింగ్ ' తో చేయగలడా.....!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో ఐనా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెసెంట్ చేస్తున్న సినిమాల సంఖ్య ఎక్కువగా నే ఉన్నాయి. వాటిల్లో ఒకటైన ఆదిపురుష్ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యి రిలీజ్ కు సిద్ధం అవుతోంది.
ఐతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరియు గ్రాఫిక్స్ వర్క్ ను జరుపుకుంటున్న ఆదిపురుష్ న్యూ రిలీజ్ డేట్ త్వరలో అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐతే మరో వైపు ప్రభాస్ మరియు మారుతి కాంబోలో సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంలో ప్రభాస్ మరియు మారుతి కాంబో మూవీ షూటింగ్ ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కానీ ఈ మూవీ కు సంబంధించిన చిన్న లీక్ కూడా ఇవ్వలేదు. అసలు ఈ కాంబో ను పీపుల్స్ మీడియా వారు నిర్మిస్తున్నట్లుగా కూడా ఇప్పటి వరకు అధికారిక అనౌన్సమెంట్ రాలేదు.ఐతే ఎందుకు ఇంత గోప్యత అనేది తెలియడం లేదు. ఐతే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ మూవీ అనేది ఎలా ఉంటుందో అనే ఆందోళన అభిమానుల్లో ఉంది.
థ్రిల్లర్ కామెడీ కథాంశంతో ఈ మూవీ ను మారుతి రూపొందిస్తున్నాడు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఐతే ప్రభాస్ తో థ్రిల్లర్ సినిమా ఏంటో అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.కానీ ఇప్పటి వరకు అఫిషియల్ గా మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఒక వైపు ప్రాజెక్ట్ కే వంటి పాన్ వరల్డ్ మూవీ చేస్తూ ఇలా మారుతి దర్శకత్వంలో మూవీ ను చేయాల్సిన అవసరం ఏంటో అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలతో పాటు ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా పాన్ వరల్డ్ మూవీస్ గా రూపొందుతున్నాయి. మరి మారుతి సినిమా కనీసం పాన్ ఇండియా మూవీగా అయినా ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మారుతి డైరెక్షన్ లో సినిమా ఉంటుందా లేదా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ను అలరించగలదా అనేది చూడాలి అంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఐతే నెక్స్ట్ ఇయర్ లో వారి కాంబో అనేది  ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్తలు నెట్టింట్ల చక్కేరలు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: