అతి చేసిన చిరు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోగా ఎదిగి తన తండ్రి కంటే విజయవంతంగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఇక రామ్ చరణ్ హీరోగా రీసెంట్ గా  వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమాని హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ మెచ్చుకోగా ఈ విషయం తెలిసిన చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జేమ్స్ కేమరూన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ మూవీ చాలా అద్భుతమైన మూవీ అని అన్నారు.ఫస్ట్ టైం ఈ సినిమాను చూశాకా సంభ్రమాశ్చర్యానికి గురయ్యానని ఈ సినిమా గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదని కేమరూన్ అన్నారు. సినిమాలో కథ చెప్పిన విధానం, రోల్స్ ఇంకా విజువల్ ఎఫెక్స్ట్ ను చూసిన తర్వాత షేక్ స్పియర్ క్లాసిక్ గుర్తుకొచ్చిందని జేమ్స్ కామెరూన్ కామెంట్లు చేశారు.


సినిమాలో రామ్ రోల్ ఛాలెంజింగ్ అని ఆ పాత్ర మనస్సులో ఏముందో తెలిశాక నా గుండె బద్దలైందని జేమ్స్ కామెంట్లు చేశారు.డైరెక్టర్ రాజమౌళిని కలిసిన సమయంలో ఈ విషయం గురించే చెప్పానని జేమ్స్ కామెరూన్ అన్నారు. ఈ కామెంట్ల గురించి చిరంజీవి స్పందిస్తూ జేమ్స్  సార్ చరణ్ పాత్రను ప్రస్తావిస్తూ కామెంట్లు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. జేమ్స్ కామెరూన్ అభిప్రాయం ముందు ఆస్కార్ కూడా చిన్నదేనని చిరంజీవి చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదిగాడా అని తండ్రిగా గర్వపడుతున్నానని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.అయితే జేమ్స్ కామెరూన్ ఆర్.ఆర్.ఆర్ టీం అందరిని పొగిడారు.కానీ చిరు మాత్రం ఈ సినిమాకి అంతా రామ్ చరణ్ మాత్రమే అన్నట్లు స్పందించాడు. ప్రస్తుతం దీనిపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మీ కొడుకు రామ్ చరణ్ ఒక్కడే తోపా.. మిగిలిన వాళ్ళు కారా.. ఎన్టీఆర్, రాజమౌళి కారా అంటూ చిరుని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: