తారకరత్న అంత్యక్రియలు ఎప్పుడంటే..?

Divya
తారకరత్న నిన్నటి రోజున రాత్రి సమయంలో అనారోగ్య సమస్యతో కన్నుమూశారు టిడిపి యువ సారథి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పేరుతో స్థాపించిన పాదయాత్రలో నటుడు తారకరత్న పాల్గొనడం జరిగింది. అయితే ఆ సమయంలోను తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుప్పంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం విదేశీయులను కూడా రప్పించారు వైద్య బృందం. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
దీంతో తారకరత్న మరణ వార్త విని సినీలోకం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇక నందమూరి అభిమానులు కుటుంబ సభ్యులకు కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. తారకరత్న కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు సినీ ప్రేక్షకులు రాజకీయ నాయకులు పలువురు అభిమానులు. ఇక తారకరత్న మృతదేహాన్ని ఈరోజు ఉదయం మోకిలాలోని తన నివాసానికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థంగా ఉంచ బోతున్నట్లు సమాచారం.

సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగబోతున్నట్లు తెలుస్తోంది.. నిన్నటి రోజున రాత్రి 11: 30  గంటల సమయంలో నారాయణ హృదయాలయ నుంచి తారకరత్న కుటుంబ సభ్యులు హైదరాబాదుకు తరలించినట్లుగా తెలుస్తోంది. తారకరత్న అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో రాణించాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉండేవారు. కానీ ఇలా ఎదుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఆయన మరణ వార్తతో తీవదిగ్రాతికి గురయ్యారు అభిమానులు. తారకరత్న సినీ కెరియర్ మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత హీరోగా మెప్పించలేకపోయారు. అలా పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు రీసెంట్గా పలు వెబ్ సిరీస్లలో కూడా నటించారు తారకరత్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: