క్రిటికల్ కండిషన్లో తారకరత్న ఆరోగ్యం.. తాజా బులిటెన్ విడుదల..!

Divya
తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి తారక రత్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. హీరోగా సక్సెస్ అవ్వాలని ఎంతో ప్రయత్నం చేశారు.. కానీ అనుకున్నంత స్థాయిలో ఆయన సక్సెస్ కాలేకపోయారు.. దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తారకరత్న ఈ మధ్యనే రాజకీయాలలోకి రావాలని ప్రయత్నాలు చేపట్టారు అందులో భాగంగానే కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా నందమూరి తారకరత్న కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేశారు.. కానీ కొంత దూరం నడవగానే ఆయన స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించగా అక్కడ ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు స్పష్టం చేశారు.
వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించి.. చికిత్స నిర్వహించారు.. ఇదిలా వుండగా నందమూరి తారకరత్న గత 22 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో విదేశీ వైద్య బృందం చేత ప్రత్యేకంగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది అని అంతా భావిస్తున్న సమయంలోనే తాజాగా ఒక వార్త బయటకు వచ్చి ఇప్పుడు అందరినీ ఆందోళనకు  గురిచేసింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేయగా అందులో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..  నారాయణ హృదయాలయ హాస్పిటల్ వర్గం మరొకసారి ఆయన బ్రెయిన్ కు స్కాన్ చేయడం జరిగింది.
ప్రత్యేక వైద్య బృందం చేత చికిత్స చేస్తున్నప్పటికీ కూడా తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకురాలేక పోయినట్లు సమాచారం. ఆయన చికిత్సకు రెస్పాండ్ కావడం లేదని.. మునిపటికంటే మరింతగా ఆయన ఆరోగ్యం క్షీణించింది  అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు , నందమూరి బాలకృష్ణ నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు చేరుకొని వైద్యులతో మాట్లాడుతున్నట్లు సమాచారం.. ఇకపోతే ఆయన త్వరగా కోలుకోవాలని అటు ప్రజలు ఇటు అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.. మరికొన్ని గంటల తర్వాత మరికొంత అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: