ధనుష్ 'సార్' మూవీ.. టార్గెట్ ఎంతో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో టాలీవుడ్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్ కు పెరిగిపోయిన నేపద్యంలో ఎంతో మంది తమిళ హీరోలు కూడా నేరుగా టాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ ఇక తెలుగు తమిళంలో కలిసి చేసిన బైలింగ్వల్  మూవీ సార్. ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్, శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఇక ఈ సినిమాను నిర్మించాడు అని చెప్పాలి. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది.

 అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. కాగా ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. అయితే ధనుష్ నటించిన సార్ సినిమాకి తెలుగులో 5.18 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది అన్నది తెలుస్తుంది. అందుకే తెలుగులో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 33.58 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 34 కోట్ల షేర్ రాబట్టాల్సిందే.

 అయితే మిగతా సినిమాల వసూళ్లతో పోల్చి చూస్తే అటు ధనుష్ కి టాలీవుడ్ లో 5 కోట్ల మార్కెట్ అయితే లేదు అన్నది సినీ పండితుల అంచనా. కానీ ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఐదు కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయమని ధనుష్ అభిమానులు భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ అక్కడక్కడ సినిమా యావరేజ్ అన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. మరి ఈ సినిమా నిర్మాతలకు ఎంత మొత్తంలో లాభాలను తెచ్చి పెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: