కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్‏ను కొరడాతో కొట్టేందుకు కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి  తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా అంతర్జాతీయ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నడు లేని రికార్డులను సృష్టించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా  లెవెల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికగా ఎన్నో అవార్డుల సైతం దక్కించుకుంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం ఈ సినిమా అందుకుంది. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం ఎదురుచూస్తోంది త్రిబుల్ ఆర్ సినిమా. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ఇక త్రిబుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ చిత్రాన్ని రూపొందించేందుకు తనకు స్ఫూర్తినిచ్చిన 2 సినిమాల గురించి చెప్పుకొచ్చాడు రాజమౌళి. అయితే ఈ సినిమా చేయడానికి తెలుగు ఐకానిక్ మూవీ మాయాబజార్ తనకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది అంటూ తెలియజేశాడు. దాంతోపాటు మిల్ గిప్సన్ బ్రేవ్ హార్డ్ కూడా తనను భీం పాట పెరకెక్కించేందుకు ప్రేరేపించిందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇటీవల న్యూ ఇయర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు రాజమౌళి. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. మాయాబజార్ లో మాట్లాడే భాష మహాభారతం లోనిది ఇంతకుముందు వచ్చిన చాలా నాటకాలు దాని తర్వాత వచ్చిన సినిమాల్లో పాత్రల కోసం పుస్తక భాషను వాడుతూ ఉంటారు..

ఎందుకంటే వారిని దేవుళ్ళు పురాతన వ్యక్తులు కావచ్చు. అయితే మాయాబజార్ సినిమాలోని పాత్రలు మాట్లాడే భాష మాత్రం ఆధునిక తెలుగు భాష సాధారణంగా దర్శకుడు దేనినైనా చాలా సులభంగా చేయగలడు అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. సినిమాల్లో వారు తెలుగులో లేని పదాలను ఉపయోగించే అనేక సందర్భాలను నేను ఇప్పటివరకు చాలా చూశాను. చాలా వరకు కేవలం కామెడీ కోసం మాత్రమే అలాంటి పదాలను కనుక్కున్నారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాటకు మిల్ గిప్సన్ బ్రేవ్ హార్డ్ స్ఫూర్తినందించింది. నాకు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ నచ్చలేదు .అది చాలా హింసాత్మకంగా ఉంటుంది. ఆ సమయంలో నేను ఒక్క సెట్టింగ్ లో కూడా దాన్ని చూడలేను బ్రేవ్ హార్డ్ సినిమాలోని క్లైమాక్స్ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కాదు. ఈ సినిమాలో భీం పాటలో అతనిని కొరడాతో కొట్టే సన్నివేశానికి అదే ప్రేరణ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: