హ్యాట్రిక్ హిట్ కొట్టిన సంయుక్త.. రేంజ్ మామూలుగా లేదుగా..!

Divya
మలయాళంలో వరుస సినిమాలో చేస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. భీమ్లా నాయక్ సినిమా హిట్ అవ్వడంతో సంయుక్త మీనన్ కి కూడా తెలుగులో భారీగా పేరు లభించింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాల్లో కూడా నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుని అలా వరుసగా వెంట వెంటనే రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి ఈ సినిమాతో కూడా మరో విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సంయుక్త మీనన్, ధనుష్ జంటగా నటించిన ఈ చిత్రం తాజాగా విడుదలయ్యి  భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ,  సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  నిన్న ప్రీమియర్ షో వేయగా మొదటి షో తోనే భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఈరోజు ఫిబ్రవరి 17న విడుదలై అంతకుమించి రెస్పాన్స్ పొందుతోంది.. సమాజంలో ఉన్న విద్యావ్యవస్థపై ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి .. పేద ప్రజల బలహీనతను డబ్బుగా ఎలా మార్చుకుంటున్నారు అనే విషయంపై తెరకేక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇకపోతే ఈ మూడు సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ రేంజ్ పూర్తిగా మారిపోయింది. తన పేరు నుంచీ మీనన్ అనే పేరును తొలగించి సంయుక్తగా తన పేరును పెట్టుకుంది. కనీసం ఇలానైనా ఆమెకు మరిన్ని విజయాలు వరిస్తాయేమో చూడాలి . మొత్తానికి అయితే మలయాలకుట్టి తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకుంటోందనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: