అనన్యాకి ఆఫర్లు లేవా..?

shami
మల్లేశం సినిమాతో తన ప్రతిభ చాటుకున్న తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అంజలి, నివేదా థామస్ లతో పాటు నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని కాపాడుకునే క్రమంలో అమ్మడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. మరి సినిమా ఛాన్స్ లు రావట్లేదా లేక వచ్చినా అమ్మడు చేయట్లేదా అన్నది తెలియదు కానీ అనన్యా నాగళ్ల ఫోటో షూట్స్ తోనే కాలక్షేపం చేస్తుంది. మొన్నటిదాకా సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన అమ్మడు వకీల్ సాబ్ సినిమా తర్వాత సోలో ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక మెయిన్ లీడ్ హీరోయిన్ గా వస్తేనే చేస్తా లేదంటే లేదు అనుకుంటూ ఉంటే ఉన్న ఈ క్రేజ్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చేసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టార్ సినిమాల్లో చిన్న పాత్రలైనా సరే ఒక్కోసారి బాగా వర్క్ అవుట్ అవుతాయి. అనన్యా నాగళ్ల అలాంటి పాత్రలు చేసినా బాగుంటుందని ఆమె ఫాలోవర్స్ అంటున్నారు. మరి అమ్మడికి అవకాశాలు రావట్లేదో ఏమో కానీ కేవలం ఫోటో షూట్స్ తోనే టైం పాస్ చేస్తుంది. అయితే సోలో హీరోయిన్ గా చేసినా పాత్రని మోసే క్యాలిబర్ ఉండాలి. అలా తనని తాను మెరుగుపరచుకుంటే బెటర్ అని కొందరు అంటున్నారు.
ఇలా ఫోటో షూట్స్ చేయడం వల్ల ఫాలోవర్స్ పెరుగుతారేమో కానీ హీరోయిన్ గా చేస్తేనే అసలు టాలెంట్ బయటపడుతుందని చెప్పొచ్చు. సైడ్ రోల్స్ వచ్చినా సరే నో అని చెబుతున్న అనన్యా నాగళ్ల ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. అందాక ఇలా ఫోటో షూట్స్ తోనే రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యింది. అయితే అమ్మడి ఫోటో షూట్స్ కి సోషల్ మీడియాలో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: