శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మహబూబ్.. చేయి కోసుకుంటానంటూ బ్లాక్ మెయిల్?

praveen
మెహబూబ్.. శ్రీ సత్య.. ఈ ఇద్దరు జోడి పేరు ఇటీవల కాలంలో తెలుగు బులితెరపై బాగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే బీబి జోడి అనే కార్యక్రమంలో ఈ ఇద్దరు జోడి తమ డాన్స్ పర్ఫామెన్స్ లతో అదరగొడుతూ ఉంది. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదరడంతో ఇక అందరికంటే వీరికే ఎక్కువ పాపులారిటీ వచ్చేస్తూ ఉంది అని చెప్పాలి. వీరిద్దరూ కూడా గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ గా మారి ఇక ప్రేక్షకులను అలరించిన వారే కావడం గమనార్హం.

 సాధారణంగా ఇలా ఏదైనా షోలో కలిసి డాన్స్ చేస్తున్నారు అంటే చాలు ఇక వారిద్దరూ కాస్త క్లోజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ప్రేమలో పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది.  ఇక్కడ ఇదే జరిగింది. ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా మహబూబ్ ఏకంగా శ్రీ సత్య ఇంటికి వెళ్లి ప్రపోజ్ చేశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీతోనే జీవితం అంటూ చెప్పాడు.  అయితే ఇక మహబూబ్ ఇలా ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయింది శ్రీ సత్య. అతనిపై సీరియస్ అయింది. అయితే శ్రీ సత్య పక్కనే కొరియోగ్రాఫర్స్ ప్రియాంక, సంకేత్ లు కూడా ఉండడం గమనార్హం.

 అయితే తన ప్రేమను ఒప్పుకోవాలని నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ ఇక శ్రీ సత్యకు చెప్పాడు మెహబూబ్. అయితే నా లైఫ్ లో ఏం జరిగిందో నీకు తెలుసు. మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు అంటూ శ్రీ సత్య చెబుతుంది. నువ్వు ఎన్ని చెప్పినా వినను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మెహబూబ్ చెబుతాడు. నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోతే ఏకంగా చేయి కోసుకొని సూసైడ్ కూడా చేసుకుంటాను అంటూ బ్లాక్మెయిల్ కు కూడా దిగుతాడు అని చెప్పాలి. దీంతో శ్రీ సత్య ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. ఇలాంటి సమయంలోనే చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు మెహబూబ్. ఇదంతా కేవలం ప్రాంక్ మాత్రమే అని చెప్పడంతో శ్రీ సత్య కోపంతో ఊగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: