'నా ఆటోగ్రాఫ్' సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫీల్ గుడ్ మూవీస్ చాలానే వచ్చాయి. అందులో మాస్ మహారాజా రవితేజ నటించిన 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పొచ్చు. ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో గోపిక, భూమిక, కనిక ముగ్గురు కథానాయికలుగా నటించారు. ఒక వ్యక్తి జీవితంలో స్కూల్ లైఫ్ నుంచి మొదలుకొని కాలేజ్ డేస్ ఆ తర్వాత జాబ్ స్ట్రగుల్స్ తర్వాత పెళ్లి ఇలా అన్ని దశలను చూపించిన ఈ సినిమా 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. 

ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ సినిమాలోని 'మౌనంగానే ఎదగమని' ' గుర్తుకొస్తున్నాయి, వంటి పాటలు ఇప్పటికీ చాలా ఫేమస్. యూట్యూబ్లో ఈ పాటలను శ్రోతలు నిరంతరం వింటూనే ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా చివర్లో రవితేజని పెళ్లి చేసుకునే హీరోయిన్ అందరికీ గుర్తుండే ఉంటుంది? ఆ హీరోయిన్ పేరు కనిక సినిమాలో.సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినా తన చక్కటి అందంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ హీరోయిన్ తెలుగులో మరికొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కనిక అసలు పేరు దివ్య సుబ్రహ్మణ్యం. 2001లో మిస్ చెన్నై అందాల పోటీలో ఈమె విన్నర్ గా నిలిచింది. అయితే తెలుగు వెండితెరపై శ్రీకాంత్ హీరోగా నటించిన 'ఒట్టేసి చెబుతున్నా' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత కన్నడ, మలయాళ,తమిళ సినిమాల్లో కూడా నటించింది.  

ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని.. సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంది. కానీ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించింది. ఈమె హీరోయిన్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా, టీవీ యాంకర్ గా కూడా చేసింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు చూసి నెటిజన్స్ అయితే ఫిదా అవుతున్నారు. అప్పటికంటే ఇప్పుడు తన గ్లామర్ డోస్ ని మరింత పెంచుతూ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేయడంతో ప్రస్తుతం అవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ సినిమాలకు దూరంగా ఉంటూ తన మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: