అల్లు శిరీష్ ని స్టార్ హీరోని చేసేందుకు.. అరవింద్ మాస్టర్ ప్లాన్?

praveen
ఎంత భారీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమైనప్పటికీ టాలెంట్ లేకపోతే మాత్రం ఇక ఇండస్ట్రీలో ఎదగలేరు అన్నదానికి నిదర్శనంగా కొంతమంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు టాలెంట్ గా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక ఇక సరైన స్టార్ డమ్ సంపాదించలేని హీరోలు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలీ. అలాంటి వారిలో అల్లు వారి అబ్బాయి శిరీష్ కూడా ఒకరు. అప్పటికే అల్లూ ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

 ప్రస్తుతం ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు అల్లు అర్జున్   పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయాడు అని చెప్పాలి. కానీ ఇక అల్లు అర్జున్ తమ్ముడుగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన శిరీష్ మాత్రం.. ఇప్పటికీ సరైన స్టార్ డం కోసం పాకులాడుతూనే ఉన్నాడు అని చెప్పాలి. అతను చేసిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోతున్నాయి. ఇక ఇటీవలే వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమాను కూడా బలవంతంగానే హిట్ అనిపించారు అన్న టాక్ కూడా ఉంది.

 అయితే ఇప్పటికే పెద్దకొడుకు స్టార్ అయ్యాడు. కానీ చిన్న కొడుకు కెరియర్ విషయంలో మాత్రం అల్లు అరవింద్ బాగా టెన్షన్ పడుతున్నాడట. ఈ క్రమంలోనే ఎలాగైనా చిన్న కొడుకు శిరీష్ ని స్టార్ హీరో ను చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఈ క్రమంలోనే ఒక పెద్ద డైరెక్టర్ చేతిలో శిరీష్ ను పెట్టాలని చూస్తున్నాడట. భారీ బడ్జెట్ అయినా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడట. ఏదో ఒకటి చేసి శిరీష్ ఖాతలో పెద్ద హిట్టునే చేర్చాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో ఇప్పటికే అల్లు అరవింద్ చర్చలు కూడా ప్రారంభించాడు అన్న టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: