తదుపరి తరం సిద్ధంగా ఉందా..?

Divya
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి దిగ్గజ నటులు సినిమా ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలవడమే కాకుండా తమ తదనాంతరం తమ వారసులను ఇండస్ట్రీకి తీసుకొచ్చి వారిని స్టార్ హీరోలుగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలకృష్ణ, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున లాంటి హీరోలు..తమ తండ్రుల వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని ఇండస్ట్రీలో తండ్రులకు తగ్గ తనయులుగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు మరొక వైపు ఇప్పటికే స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన స్టేటస్ సొంతం చేసుకోవడమే కాకుండా తమ వారసులకు కూడా స్టార్ స్టేటస్ ను కట్టబెట్టారు.
ఎప్పటికప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారు తమ తదనంతరం తమ వారసులను తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటు మహేష్ బాబు కొడుకు గౌతమ్ , ఇటు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా లు, మరొకవైపు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు అనే వార్తలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.  అయితే తమ స్టార్ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి వస్తున్నారన్న ప్రతిసారి కూడా అభిమానులలో ఎక్కడలేని సంతోషం కలుగుతోంది.  కానీ ఇందుకు సంబంధించిన అధికారిక అప్డేట్ రాకపోవడం గమనార్హం.
మహేష్ బాబు కొడుకు గౌతమ్ విదేశాలలో చదువుకుంటున్న నేపథ్యంలో చదువు పూర్తయిన తర్వాతనే ఆయన ఇండస్ట్రీలో కొచ్చే అవకాశం ఉంది. మరొకవైపు పవన్ కళ్యాణ్ కొడుకు  అకీరా కూడా  చదువుకుంటున్నప్పటికీ కూడా ఆయన టాలెంటు , కటౌట్ చూస్తే మాత్రం వెంటనే ఇండస్ట్రీలోకి వచ్చినా  తండ్రిని మించి స్టార్ ఇమేజెస్ సొంతం చేసుకుంటారు అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.  మరొకవైపు బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను 2024 ఎలక్షన్స్ తర్వాత సినిమా ఎంట్రీ కి సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.  ఒకవేళ అన్నీ జరిగితే తదుపరి తరం ఇండస్ట్రీ లోకి రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: