కళ్యాణ్ రామ్ ఆఖరి 5 సినిమాల మొదటి రోజు కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడి గా , నిర్మాత గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఆఖరుగా నటించిన 5 మూవీలు మొదటి రోజు సాధించిన కలెక్షన్ల వివరాలను తెలుసు కుందాం.
కళ్యాణ్ రామ్ తాజాగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వం లో రూపొందినటు వంటి అమిగోస్ అనే మూవీ లో  నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రా భినయం లో నటించాడు .  ఈ మూవీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు 2.03 కోట్ల కలెక్షన్లను సాధించింది.
కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం బింబిసారా అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు 6.30 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఈ మూవీ పోయిన సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీల లిస్ట్ లో చేరిపోయింది.
కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఎంత మంచి వాడవు రా సినిమా మొదటి రోజు 2.20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
కె.వి గుహాన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందినటువంటి 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మొదటి రోజు 1.60 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
జయేంద్ర దర్శకత్వంలో రూపొందినటువంటి నా నువ్వే మూవీ మొదటి రోజు 0.75 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటించింది. 2018 వ సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: