బాలయ్య ఆ తప్పు చేయకపోతే ఇప్పుడిలా ఉండకపోయేవాడేమో..!?

Anilkumar
కాలం ఎవరిని ఎటువైపు తీసుకెళుతుందో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలోనే ఒక కండక్టర్ ని దిగ్గజ దర్శకుని దృష్టిలో పడేలా చేసింది.అలా శివాజీ గైక్వాడ్ అనే ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని సూపర్స్టార్ రజినికాంత్ ని చేసింది. కన్నడకు చెందిన ఆ వ్యక్తిని తమిళ సూపర్స్టార్ ను చేసింది. ఒక విధంగా చెప్పాలంటే రజనీకాంత్ నటించిన సినిమాలు ఏ సినిమాకి ఆ సినిమా అద్భుతాలు సృష్టించినవే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి సినిమాలలో భాషా సినిమా కూడా ఒకటి. ఇక భాషా సినిమా రజనీకాంత్ నటించిన సినిమాల అన్నిట్లోనూ ఒక మైల్డ్ స్టోన్ అని చెప్పొచ్చు. ఈ సినిమా సౌత్ సినీ ఇండస్ట్రీని ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అప్పట్లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు కొత్త కొత్త రికార్డులను సైతం సృష్టించింది ఈ సినిమా. ఇక దీని అనంతరం ఈ సినిమాని తెలుగులో డబ్ చేయడం జరిగింది. సురేష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ముందుగా ఈ సినిమాను తమిళంలో మాత్రమే తీశారు. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాని రిమూవ్ చేయాలని భావించారు. అందుకుగాను ఈ సినిమా నిర్మాతలు హైదరాబాదులో హీరోల కోసం ఒక స్పెషల్ ఈవెంట్ ని కూడా అప్పట్లో చేయడం జరిగింది. అప్పట్లో ఈ సినిమాని ఈ సినిమా దర్శకుడు సురేష్ కృష్ణ చిరంజీవి లేదా బాలకృష్ణతో రీమిక్స్ చేయాలని భావించాడు.

అంతేకాకుండా ఈ సినిమాకి బాలకృష్ణ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని భావించాడట ఈ సినిమా దర్శకుడు సురేష్.ఈ నేపథ్యంలోనే సురేష్ కృష్ణ చాలాసార్లు బాలకృష్ణను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పాడట. ఇక ఆ సమయంలో బాలకృష్ణకు రీమిక్స్ సినిమాలు అంటే అంతగా నచ్చకపోయేవి. బాలకృష్ణ ఎప్పుడు కూడా ఒరిజినల్ కథతోనే సినిమా తీస్తాడు. అందుకే భాష సినిమా రీమిక్స్ చేయడానికి బాలకృష్ణ ఒప్పుకోలేదు. దీంతో వేరే ఆప్షన్ లేక ఈ సినిమాను రజనీకాంత్ తోనే యధావిధిగా డక్ చేయడం జరిగింది. ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఈ వార్త విన్న చాలామంది నందమూరి అభిమానులు ఇంతలా బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా బాలకృష్ణ చేసి ఉంటే బాగుంటుందని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన 18వ సినిమాని చేసే పనిలో బిజీగా ఉన్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: