ఆ యాంకర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సురేఖ వాణి కూతురు సుప్రీత.. ఎవరంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని కీలకపాత్రలో నటిస్తూ హీరో హీరోయిన్ల కి తల్లిగా అక్కగా అత్తగా అనేక క్యారెక్టర్లలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది సురేఖ వాణి. ఐదు పదుల వయసు దాటినప్పటికీ హీరోయిన్లకు మించే అందంతో అందరినీ ఎప్పటికప్పుడు ఫిదా చేస్తూ ఉంటుంది సురేఖ వాణి. అంతేకాదు ఆమె వేసే డ్రెస్సుల వల్ల చాలాసార్లు ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటుంది. ముఖ్యంగా తన భర్త చనిపోవడంతో చాలామంది తను వేసే డ్రెస్సులకు సంబంధించి రకరకాల కామెంట్లను చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా జీ తెలుగులో ఓ రెండు ప్రేమ మేఘాలు అనే షో ఆదివారం రోజు రానుంది. 

తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .అయితే ఇక ఈ ప్రోమోలో భాగంగా యూట్యూబ్ నిఖిల్ సింహా మరియు సురేఖ వాణి కూతురు సుప్రీత ఇద్దరు ప్రేమికులుగా కనిపించడం జరిగింది. వీళ్లిద్దరిని ప్రోమోలో జంటగా చూసిన చాలామంది నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ రకరకాల కామెంట్లను చేస్తున్నారు. ఓ రెండు ప్రేమ మేఘాలు అనే షోలో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరినీ కొన్ని ప్రశ్నలను కూడా అడిగాడు ప్రదీప. ఇందులో భాగంగానే ప్రదీప్ మాట్లాడుతూ మీరిద్దరూ ఎక్కడ కలిశారు ఎప్పుడు కలిశారు అంటూ అడిగాడు.

దానికి సమాధానంగా మేము కరోనా లాక్ డౌన్ లో కలిసాము అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇలా చెప్పడంతో వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారని అందరూ భావిస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా లేక షో కోసం ఇలా కలిసి కనిపించారా అన్నది తెలియాలంటే ఈ షో వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే సురేఖ వాణి మరియు సుప్రీత ఇద్దరూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూ వస్తున్నారు. కానీ వారిద్దరూ వారిద్దరిపై వస్తున్న రూమర్లను ఏమాత్రం పట్టించుకోకుండా బిజీగా ఉంటారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సురేఖ వాణి కుదురు సుప్రీత హీరోయిన్గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది అని సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వస్తున్నాయి .కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా సుప్రీత ఇవ్వలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: