చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'RC15' ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేస్తుంది..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక గత ఏడాది ఆయన హీరోగా నటించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతోఒక్కసారిగా పాన్ఇండియా స్టార్ గా మారిపోయాడు. అంతేకాదు అల్లూరి సీతారామరాజుగా తన అద్భుతమైన నటనతో వరుసగా అవార్డులు కూడా అందుకున్నాడు. ఇక ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'ఆర్సి15' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ లేకపోవడంతో ఫాన్స్ అయితే తీవ్ర నిరాశ  చెందారు. ఇక అలాంటి ఫ్యాన్స్ కి తాజాగా మూవీ టీం గుడ్ న్యూస్ చెప్పింది.

 ఎట్టకేలకు ఆర్సి15 ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్మెంట్ కు డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ బయటకు రావడంతో చెర్రీ ఫాన్స్ ఇప్పుడు ఆర్సి15 గురించే సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆర్సి15 కు సంబంధించిన లీక్డ్ ఫోటోలతో ఎంజాయ్ చేస్తున్నారు ఫాన్స్. ఇప్పటికే చాలాసార్లు దిల్ రాజుని 'RC 15' గురించి అప్డేట్ ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశారు. దీంతో అభిమానుల బాధని చూడలేకపోయిన దిల్ రాజు తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజున 'RC15' ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ ఉంటుందంటూ చెప్పేశాడు దిల్ రాజు  ఇక ఈ అప్డేట్ తో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

 ఆరోజు ఒక వైపు రామ్ చరణ్ బర్త్ డే అదే రోజు ఆర్సి15 ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ ఉండడంతో ఫ్యాన్స్ ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. మరోసారి ఆర్సి15 హ్యాష్ టాక్ ను ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం 'RC 15' షూటింగ్ హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో జరుగుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కీయారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.సుమారు 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: