లోకేష్ కనగరాజ్ 'లియో' సినిమాలో రామ్ చరణ్ రోల్ అదేనా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లోకేష్ కనకరాజు కాంబినేషన్లో ఒక సినిమా రావాలని వారి అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనకరాజ్ ఖైది, విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతోపాటు ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకు సైతం ఫేవరెట్ డైరెక్టర్గా మారాడు. అయితే ఈయన దర్శకత్వంలో రానున్న తర్వాత సినిమా లియో. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు చిత్రబంధం. టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఈ టీజర్ చివరి షాట్ లో తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న ఖరీదైన కారుని మనం చూడొచ్చు. 

ఇక ఈ షార్ట్ ని చూసిన వారందరూ ఆ కారులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ కనిపిస్తాడని సమాచారం. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో ఒక పెద్ద పేరు మోసిన గ్యాంగ్ స్టార్ లాగా రామ్ చరణ్ కనిపిస్తాడట. దీంతో రామ్ చరణ్ ఈ సినిమాలో గాని కనిపిస్తే ఈ సినిమా ఖచ్చితంగా రికార్డ్ స్థాయి బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.  విజయ్ కోరుకున్న హిట్ ఈ సినిమాతో తనకి దక్కుతుందని అంటున్నారు.

ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలో సక్సెస్ తో ఆయన మార్కెట్ను అమాంతం పెంచుకుంటున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఇస్తున్నాడు విజయ్. ఈ నేపథ్యంలోని లియో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమాకి గాను దాదాపుగా 150 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మల్టీ స్టార్స్ లో నటిస్తే విజయ్ కి ఫ్యాన్ ఫాలింగ్ మరింత పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: