రాఘవ లారెన్స్ "రుద్రుడు" మూవీ ఫస్ట్ సింగల్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ మరియు నటుడు అయినటువంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాన్సర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన లారెన్స్ ప్రస్తుతం సినిమాల్లో హీరో గా నటిస్తూ అలాగే అప్పుడప్పుడు పాటలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నటుడి గా లారెన్స్ ఎక్కువ శాతం హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లారెన్స్ "రుద్రుడు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఎస్ కతిరేషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది.
 

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా మొదటి పాట విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క మొదటి పాట అయినటువంటి "పాడత పటెళ్ళం" అనే సాంగ్ ను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో లారెన్స్ చేతిలో ఒక బోకే ను పట్టుకొని స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: