రాజమౌళి వ్యూహంతో లాభపడ్డ చంద్రబోస్ !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదలైన తరువాత ఊహించిన విధంగా ఆమూవీ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయలేకపోవడంతో బయటకు చెప్పకపోయినా రాజమౌళి లోలోపల షాక్ అయ్యాడు అని అంటారు. అయితే ఆషాక్ నుండి తెలివిగా వెంటనే తేరుకున్న జక్కన్న ఈమూవీని జపాన్ భాషలో డబ్ చేసి అక్కడ తన మూవీకి జపాన్ లో మంచి కలక్షన్స్ వచ్చేలా చేసి ఇప్పటి వరకు రజనీకాంత్ సినిమాలకు జపాన్ దేశంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసాడు.

అంతటితో ఆగకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ఆస్కార్ అవార్డ్స్ ప్యానల్ లో నిలపడం కోసం రాజమౌళి ఏకంగా రెండు నెలలు అమెరికాలో ఉండటమే కాకుండా ఒక్క క్షణం తీరిక లేకుండా అమెరికాలో ఈమూవీని ప్రమోట్ చేస్తూ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా హాలీవుడ్ మీడియాతో ‘ఆర్ ఆర్ ఆర్’ గోప్పసినిమా అంటూ హాలీవుడ్ మీడియా చేత ప్రశంసలు కురిపించుకోవడానికి అదేవిధంగా తన ‘నాటునాటు’ పాటకు హాలీవుడ్ మీడియాలో మ్యానియాను తీసుకురావడానికి ఏకంగా రాజమౌళి 50కోట్ల వరకు ఖర్చుపెట్టాడు అని అంటారు.

అంతేకాదు ‘నాటునాటు’ పాటను హాలీవుడ్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేయడానికి జక్కన్న ఏకంగా జూనియర్ చరణ్ లను తనవెంట తీసుకువెళ్ళి అక్కడ మీడియాకు ఇంటర్వ్యూలు ఇప్పించాడు. వాస్తవానికి రాజమౌళి విదేశీ సినిమాల కేటగిరిలో గతంలో కొరియన్ మూవీ "పేరసైట్" కి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ దక్కినట్టు ఈసారి "ఆర్ ఆర్ ఆర్" కు ఉత్తమ చిత్రం అవార్డు వస్తుందని ఇంత వ్యవహారం నడిపించాడు అని అంటారు. రాజమౌళి కృషి వల్ల  ఆస్కార్ అవార్డు ప్యానల్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ డివిజన్ లో ‘నాటునాటు’ పాట ప్యానల్ కు ఎంపిక అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈపాటకు అవార్డు ఊహించిన విధంగా వస్తే అవార్డు ఫంక్షన్ లో వేదిక పైకి కీరవాణి తో పాటు ఈపాటను రచించిన చంద్రబోసును కూడా వేదిక పైకి పిలిచే అవకాశం ఉంది.

అమెరికాలో ముఖ్యంగా ఆస్కార్ అవార్డులు ప్రకటించే సందర్భంలో ఆసినిమాల రచయితలు పాటల రచయితలను గౌరవించే సాంప్రదాయం ఉంది. దీనితో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్ వస్తే ఆ ప్రైజ్ మని కీరవాణితో కలిపి చంద్రబోసు షేర్ చేసుకుంటాడు కానీ ఆస్కార్ అవార్డ్ ప్యానల్ దృష్టిని ఆకర్షించడానికి భారీ మొత్తంలో ఖర్చుపెట్టిన రాజమౌళికి కలిసికాచ్చేది ఏమిటి అంటూ కొందరు  జోక్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: